ప్రొద్దున్నే పడుకోనివ్వని ‘నీకు’…….

/#/ ఉదయాన్నే నిద్ర లేపి మరీ అడిగావు…

“అందరూ చెప్తుంటారు కదా,

ప్రేమలో ఉంటే ప్రపంచమంతా నువ్వే కనిపిస్తావని,

రాత్రి నీ కలలతో నిద్రపోయి, ఉదయం నీ ఊహలతో మేల్కొని,

రోజంతా నీ జ్ఞాపకాలతో గడిపేస్తూ ఉండాలని,

నీ కళ్ళలోని భావాలని చూడాలని,

నీ హృదయపు చప్పుడుని వినాలని,

నీ ఊపిరిలోని పరిమళాన్ని ఆస్వాదించాలని,

ఇంకా ఎన్నో ‘అని’ నీకు అనిపిస్తుందా అని”

మరి నాకేంటి అంతా మునుపటిలానే ఉంది..!

అదే మాట నీతో అంటే కోపంగా Call cut చేసేసావ్..

ఏమో నాకు మాత్రం ప్రేమంటే

” ‘నిన్నటి’కంటే ‘ఈరోజు’కి నీ మీద ఇష్టం పెరగటం

అది ‘రేపటి’కి ఇంకొంచెం పెరుగుతుందనే నమ్మకం ఉండటం”

అంతే.!

అర్ధం చేసుకుంటావు ‘అని’ అనుకుంటూ…/#/

ఇట్లు

ఇంకా నిద్ర సరిపోని ‘నేను’



B.Tech

Posted: February 4, 2011 in Uncategorized
ఇంకా 2   నెలలు మాత్రమే ఉన్నాయంట..
4 సంవత్సరాల మన సంతోషాలకి..

classకి రావాలన్నా, canteen కి  వెళ్ళాలన్నా
bunk కొట్టాలన్నా, మన batch తో తిరగాలన్నా

‘ఎన్నో’ పనులకి ఈ చిన్ని రోజులు సరిపోతాయో లేదో…!

ఆఖరికి పడుకుంటే ఒక night, miss  అవుతుందేమో  అని,
నిద్రలేస్తే మరొక రోజు మన నుంచి వెళ్ళిపోతుందేమో అని,
అనుకుంటూ ఉండగానే ‘అన్నీ’ గడుచిపోతున్నాయ్..

అందుకే రోజురోజుకి  college అంటే ఇష్టం పెరిగిపోతుంది..

బహుశా మీరు ఉన్నారనో .. తర్వాత మీరు ఇంక ఉండరనో…

ఇది రాయటానికి కూడా కష్టంగానే ఉంది…
ఐనా, మనల్ని మనకి మరోసారి గుర్తు చేయాలనీ…..
మీకు కూడా  ఇలాగే ఉందా అని అడగాలనీ…!

….స్నేహంతో

ప్రేమతో

Posted: January 29, 2011 in Uncategorized

ప్రేమని ప్రేమించమని ప్రేమగా, ప్రేమతో అడిగేంత ప్రేమ బహుశా నా ప్రేమకు లేదేమో..

అందుకే  ఇన్నేళ్ళ నా నిరీక్షణలో,
నేను ప్రేమిస్తున్నా అని చెప్పానే కానీ,
నన్ను ప్రేమించమని అడగలేదు..
ఐనా , ప్రేమించటం ఆనందం.. ప్రేమని పొందటం అదృష్టం..
నేను ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా,
అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నా… ప్రేమతో

for MANASWI

Posted: January 23, 2011 in Uncategorized

మనస్వీ..,,,,

నీ పుట్టిన రోజు కదా..!
4 రూపాయలతో FLOWER ఇవ్వొచ్చు..
40 రూపాయలతో CHOCKY ఇవ్వొచ్చు..
400 లతో GIFT ఇవ్వొచ్చు..
4000 లతో PARTY ఇవ్వొచ్చు..
కానీ,,
4 కాలాలపాటు ఉండేలా…
40 ఏళ్ల తర్వాత కూడా గుర్తుండేలా…
400 సార్లు, కాదు.. కాదు..
4000 సార్లు చెప్తున్నా..
ఈ 4 మాటల్ని..
WISH
U
HaPpy
BiRtHdAY
by రాజేష్….

कब से केहने  के हिम्मत जुटा रहा हु,

के तुमसे मोहब्बत हे कितनी.?
जाने या जसा क्या हुवा, के दिल ने कहा केही डालू,
जब किताब के पड्नो की  सफ्हेदी,
तुम्हरे चहले पर चमकती  है दिल रुकसा जाता है!
जब हसी की एक तंडे लगे मेरे  गानो  तक आती है ,वह तमासा जाता है!
जाने या जसा क्या हुवा दिल ने कहा केही डालू
कितनी मोहब्बत हे तुमसे..?
……राजेष

JYOTHIKI

Posted: January 20, 2011 in Uncategorized
చిన్ననాటి  అల్లరిని,ప్రేమని,పెంకితనాన్ని,ప్రియమైన జ్ఞాపకాల్ని…
జడ గంటల కోసం, మువ్వల పట్టీల కోసం నువ్వు చేసిన పనులు, చెప్పిన కారణాలు,
పండగలప్పుడు  గుడిలో పూజలు,పరికిణీతో నువ్వు ఇచ్చిన ఫోజులు మన ఊరి వీధులు ఇంకా మర్చిపోకముందే..

అప్పుడే అమ్మగా మారిపోయావ్…!


చిన్నప్పుడు అన్ని తనకే కావాలని అమ్మని విసిగించే రాక్షసికి మరో బుల్లి రాక్షసి పుట్టింది..
ఎప్పుడూ friends   తోనే గడపాలనే friend   కి ఒక చిన్ని నేస్తం వచ్చేసింది ..
ఎప్పటికీ ఈ  సంతోషాలు నీతోనే, ఇప్పట్నుండి నీ పాప రూపంలో ఉండాలని..!
………………………………రాజేష్

nee kosam

Posted: January 10, 2011 in Uncategorized

ఈ విశాల ప్రపంచంలో,
నిన్ను కలుసుకోవటానికి ఉన్న అన్ని మార్గాలని మూసివేసి నువ్వు వెళ్లిపోయావ్…
బహుశా నీకు గుర్తులేదేమో,
నీ రూపు గుండెలో , నీ తలపులు మదిలో , నీ జ్ఞాపకాలు మస్తిష్కంలో
మిగిల్చి వెళ్తున్నావని, అవి ఎప్పటికీ మర్చిపోలేనని, మరపురానివనీ మళ్లీ నీకు చెప్పాలని ఉంది
ఎప్పటికైనా నీ మనసులోనే పదిలంగా ఉంచుకో ఈ మాటల్ని, ఈ మనుసుని…..!
......RAJ

LIFE

Posted: January 6, 2011 in Uncategorized

లైఫ్ గడిచిపోతుంది.. dull గానో , dry గానో  తెలియదు కానీ….  గడుస్తూ ఉంది …

ఏదో  కావాలి అని కోరుకుంటుంది మనసు..
busstop లో చూసిన అమ్మాయి మొబైల్ నెంబర్ కావాలనీ..
చిన్నప్పుడు స్కూల్లో విరిగిపోయిన పలకని తెచ్చి అతికించాలనీ…
మట్టితో మళ్లీ గూళ్ళు కట్టుకోవాలనీ..
సముద్రమంత ప్రేమని పంచాలనీ.. అదే ప్రేమని పొందాలనీ……

వేసవి కాలంలో జాబిలి,
వర్షాకాలంలో గాలి,
శీతాకాలంలో చలి,
నీ నీరిక్షణలో..మరొక సంవత్సరం వచ్చేసింది చెలీ.!
ఎప్పటికైనా నువ్వోస్తావనే ఆశ,
నీకై ఎదురు చూస్తున్నానని నా శ్వాస,
చెప్పమంటున్నాయి నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..